SRD: కొండాపూర్ మండలం గారకుర్తి వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఎస్సై సోమేశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం దాడులు నిర్వహించారు. ఒక జేసీబీ, ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుకను సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.