విశాఖపట్నంలో బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట ప్రసాద్ పాల్గొని, పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.