TG: జనగామ జిల్లాకు, ఇక్కడ నిర్మించే విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య పోరాట పటిమ నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోకాపేట భూమి విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.