AP: రాష్ట్ర జలాల్లో అక్రమ చేపల వేటను ప్రభుత్వం తీవ్రంగా తీసుకుందని మాజీమంత్రి సోమిరెడ్డి తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను అడ్డుకుంటామని చెప్పారు. ‘మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడతాం. వారికి అండగా ఉండాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు. తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతో మనవాళ్లు చర్చిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశాం’ అని వెల్లడించారు.