స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.30 కోట్ల భారీ పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో యాష్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.