E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో కొలువై ఉన్న శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ భోగి విశ్వనాథ్ జి విచ్చేసి స్వామివారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా విష్ణు సహస్ర నామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు బలుసు సత్యనారాయణ పాల్గొన్నారు.