TG: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ చిన్న భిన్నం కావడానికి కేసీఆర్, హరీష్ రావులే కారణమని ప్రభుత్వం చీఫ్ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలో పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించబోతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు నిజాయితీగానే ఉన్నారని.. అధికారం పోయాక అబద్ధాలు ఎక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు.