AP: గత ప్రభుత్వం ఐదేళ్లలో వ్యవస్థలను నాశనం చేయడం వల్లే నేడు ప్రజలు రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వచ్చిన 335 ఫిర్యాదుల్లో 296 పరిష్కరించామని తెలిపారు. గతంలో ప్రజలు సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం ప్రతివారం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.