AP: పల్నాడు మాచర్లలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి దాహంగా ఉందని.. మంచినీళ్లు కావాలని నమ్మించి లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించగా.. తనకు HIV ఉందని మొరపెట్టుకున్నా వినకుండా.. ఆమెను స్కార్ఫ్‌తో కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.