IPL 2026 సీజన్లో కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడంతో ప్రస్తుతం CSK జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తమకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. ఈ సీజన్లో CSK యువ జట్టుతో బరిలోకి దిగిందని తెలిపాడు. కొత్త ఆటగాళ్లపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని, వారు లీగ్లో కుదురుకోవడానికి సమయం పడుతుందని పేర్కొన్నాడు.