AP: అమరావతి బిల్లు చారిత్రాత్మకమని, ఇది ప్రజల కలల రాజధాని అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై వైసీపీ విషప్రచారం చేసిందని, జగన్ వ్యాఖ్యలు కేవలం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలోనే అమరావతి అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.