GNTR: రాజధాని అమరావతి పరిధిలోని వైకుంఠపురం, అనంతవరం గ్రామాల్లో 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. బీఎస్ఎన్ఎల్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. 4జీ సిమ్ కోసం సమీప కస్టమర్ సర్వీస్ సెంటర్లు, తుళ్లూరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ను సంప్రదించవచ్చని సంస్థ తెలిపింది. దీంతో డిజిటల్ సేవలు మెరుగుపడనున్నాయి.