TG: కాంగ్రెస్‌కు తాను రాజీనామా చేయడం లేదని ఆ పార్టీ నేత ధర్మపురి సంజయ్ స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడి మాటతో కొంతకాలం వెయిట్ చేస్తానని తెలిపారు. నిజామాబాద్ ప్రజలకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని తేల్చి చెప్పారు. గత కొంత కాలంగా పొమ్మన లేక పొగ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, హైకమాండ్ తన విషయంలో పాజిటివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు.