బాపట్ల నందిరాజుతోట వద్ద బాలుడి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. బైక్పై వచ్చిన ఓ వ్యక్తి బాలుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నించాడు. గమనించిన తల్లి పరుగెత్తుకొచ్చి నిందితుడిని కిందకు లాగేసింది. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పట్టణంలో నిన్న కూడా ఓ పాప కిడ్నాప్ అయిందని పోలీసులు తెలిపారు.