JN: జఫ్ఫర్గడ్ మండలంకు చెందిన కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్, ఎమ్మెల్యే కడియం శ్రీహరిను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవన మంజూరు, జాల్ తండా నుంచి రామన్నగూడెం వరకు బీటీ లింక్ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నిధుల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యేకు సర్పంచ్ అందజేశారు.