కోనసీమ: ఈనెల 7న అమలాపురం కలెక్టరేట్ వద్ద ఉన్న ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన అభ్యర్థులు ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలకు అర్హులు అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.