SKLM: పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ ఆలయం సమీపంలో జరుగుతున్న ROB పనులకు రూ.15 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు .ఈ నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి జిల్లా ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దీని వల్ల భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు