భారత్ తీసుకొచ్చిన కొత్త ట్రాన్స్జెండర్ల బిల్లుపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సంప్రదింపులు లేకుండా ఈ బిల్లును ఆమోదించడం వల్ల వారి హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హక్కుల రక్షణలో మార్గదర్శిగా ఉన్న భారత్, ఈ నిర్ణయంతో వారిని అట్టడుగుకు నెట్టే అవకాశం ఉందని UNO విచారం వ్యక్తం చేసింది. నిబంధనలను పునఃపరిశీలించాలని సూచించింది.