ATP: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు రూ. 15.22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ శుక్రవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 27 విడతల్లో 511 మందికి 5.50 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట వరమని కొనియాడారు.