E.G: రాజమండ్రి దేవీ చౌక్ దశావతార సీతా రామాలయంలో ‘శ్రీ సీతారామ పుష్ప యాగం’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బి. కామరాజు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా యాగం జరిపించారు. సీతా, లక్ష్మణ సమేత రామచంద్ర మూర్తికి వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో( పుష్పాభిషేకం ) పూలస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ సభ్యులు, భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.