ADB: బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయటం పట్ల బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. దీంతో విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, BRS నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.