ఎండాకాలంలో పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని హైడ్రేటెడ్‌గా ఉంచకపోతే ఆరోగ్యం క్షీణించే ప్రమాదముంది. శీతల పానీయాలకు బదులుగా పండ్ల రసాలను పిల్లలకు తాగించాలి. సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. కాటన్ బట్టలు, వదులుగా ఉన్న బట్టలు వేయాలి. బయటకెళ్లినపుడు పిల్లలకు సన్‌గ్లాసెస్, తలపై టోపీ పెట్టాలి. మజ్జిగ, అంబలి వంటివి తాగించాలి.