SRD: ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. అలాగే మంజీరా, నక్కవాగు జలాలు కలుషితం కాకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.