SS: గోరంట్ల మండలం శిరగంవాడ్లపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త రంగప్ప అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రంగప్ప పార్టీకి చేసిన సేవలను ఆమె కొనియాడారు.