SDPT: భారతీయ శౌర్యానికి నిలువెత్తు రూపం ఛత్రపతి శివాజీ అని శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు కొనియాడారు. శివాజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన కళానైపుణ్యంతో ఒక సబ్బుబిళ్లపై శివాజీ చిత్రాన్ని అత్యంత సూక్ష్మంగా మలచి రామరాజు అందరినీ ఆశ్చర్యపరిచారు. శివాజీ ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.