BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో రైతులకు ఉపయోగపడే విధంగా గడ్డం వీరారెడ్డి BRC సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కేంద్రంలో మొత్తం 32 రకాల నాణ్యమైన విత్తనాలతో PMDS కిట్స్‌ను తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచారు. తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించేందుకు ఈ కిట్స్ సహాయపడతాయని వారు చెప్పుకొచ్చారు.