కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన లొల్లలాకుల ఆధునీకరణకు రూ.74.20 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో సాగునీటి సమస్య తీరడమే కాకుండా, పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.