ATP: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేతలు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, తోపుదుర్తి నయనతా రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులను వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.