E.G: రాజమండ్రిలోని BJP కార్యాలయం వద్ద శుక్రవారం ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సపల్లి హారిక ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మంచినీటి, డ్రైనేజీ, రోడ్లు, వికలాంగులు పింఛన్ల, తదితర సమస్యలపై పలు వినతి పత్రాలు వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టమన్నారు.