VZM: ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అధితి గజపతిరాజు అన్నారు. విజయనగరంలోనిఅశోక్ బంగ్లాలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ప్రజలు నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.