WGL: కష్టపడే ప్రతి ఒక్కరికి తన కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. సంగెం మండలంలోని రామచంద్రపురం గ్రామ కాంగ్రెస్ నేతలు స్వర్ణతో భేటీ అయ్యారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ రాబోయే అన్ని ఎన్నికలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.