పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర కనిపించే ‘WC’ అంటే ‘వాటర్ క్లోసెట్’.. నీటి సదుపాయం, ఆధునిక ఫ్లషింగ్ సిస్టమ్ ఉన్న గది అని అర్థం. ఇలా WC బోర్డ్ పెట్టడం 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదలు కాగా.. రెస్ట్రూమ్స్ని పర్యాటకులు సులభంగా గుర్తించేందుకు ప్రాచుర్యం పొందింది. అలాగే టాయిలెట్ సౌకర్యం మాత్రమే ఉన్న చోట్ల WC బోర్డ్ పెడుతుంటారు.