TG: రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 36°C నుంచి 38°C వరకు నమోదవుతున్నా.. సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడనుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. HYDలో సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో 30-40 కి.మీ. వేగంతో వీచే గాలులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.