MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సాధనలను ప్రతిబింబించే ఓపెన్ డే నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలిచిన ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ డా.విజయ్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాధించిన విజయాలు అందరినీ ఆకట్టుకున్నాయి.