AP: ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తన పని అని YCP నేత పేర్ని నాని పేర్కొన్నారు. ఖాకీ మాటున అధికార పార్టీ కోసం తప్పులు చేస్తున్నా, వేధిస్తున్నా ప్రశ్నించకూడదా అని పోలీస్ శాఖను నిలదీశారు. ఒక్కరిని అంటే అందరూ వస్తున్నారని, మరీ ఒక్కరు తప్పు చేస్తే అందరూ చేసినట్లేనా అని ప్రశ్నించారు. తప్పు చేసినవారిని ప్రశ్నించడమే తాను చేసిన నేరమయితే ఏ దండన విధించినా శిరసావహిస్తానని తెలిపారు.