BDK: భద్రాచలంకు పెను ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ యంత్రాలతో కరకట్టకు ఇసుక తోలకాలు గండిపెట్టి మరి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసలే గోదావరి వరదల వల్ల ప్రతిఏటా రైతులు నష్టపోతున్నారని, ఇప్పుడు అక్రమ ఇసుక తోలకాల వల్ల మరింత ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడాలని అన్నారు.