MLG: ఏటూరు నాగారంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను BRS పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరిశీలించారు. భూ-గర్భ జలాల పెరుగుదలకు, గ్రామంలో పారిశుద్ధ్య మెరుగుదలకు ఇంకుడు గుంతలు ఎంతో దోహదపడతాయని జిల్లా పార్టీ అధ్యక్షులు అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.