KRNL: ఆదోని పట్టణానికి తాగునీరు అందించే బసాపురం ఎస్ఎస్ ట్యాంక్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఇవాల పరిశీలించారు. అధికారులు, నాయకులతో కలిసి నీటి నిల్వలను తనిఖీ చేశారు. మరో నెలకు సరిపడా నీరు ఉందని తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.