TG: దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య అని, ఆయన స్ఫూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.