HNK: పరకాల పట్టణంలో గుడ్ ఫ్రైడేను పరిష్కరించుకుని కారుణ్య యేసు క్యాథలిక్ ప్రార్థన మందిర ఫాదర్ బాలరాజు ఆధ్వర్యంలో యేసు సిలువ యాత్ర కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పరకాల పట్టణ ప్రజలు సిలువ యాత్రను ఎంతో ఆసక్తిగా తిలకించారు. టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ ప్రెసిడెంట్ మడికొండ శ్రీనివాస్, సంపత్ కుమార్, సిస్టర్లు, స్థానికులు పాల్గొన్నారు.