KNR: తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు దొడ్డి కొమురయ్య అని, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశ్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేష్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.