MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో నూతనంగా నిర్వహించనున్న రామమ్మ దేవాలయ భూమి పూజ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ఒక్కో అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తామని వెల్లడించారు. కార్యక్రమంలో గుడి అధ్యక్షులు యశోద తదితరులు పాల్గొన్నారు.