ADB: కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కావడానికి 36 గంటల సమయం పట్టనుంది. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో, మీసేవలు సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి రానున్నాయి.