SDPT: గత ఏడాది పదో తరగతి పరీక్షల మూల్యాంకనం చేసిన ఉపాధ్యా యులకు నిధులు విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం చేసిన సుమారు 600 మంది ఉపాధ్యా యులకు ఇంతవరకు డబ్బులు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించలన్నారు.