ATP: అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతిపత్రాలను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విని, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.