HYD: మీసేవ వాట్సప్ ద్వారా ఆదాయం, నివాసం, GHMC బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఆఫీసులో వద్దకు వెళ్లకుండా ఉండొచ్చని ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ, ఇది కేవలం మున్నాళ్ల ముచ్చటగా మిగులుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. GHMC బర్త్, డెత్ సర్టిఫికెట్ల వివరాలు మాత్రమే సర్చ్ చేయడానికి ఆప్షన్ ఉందని, దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ కనిపించడం లేదని చెబుతున్నారు.