కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ యువ నాయకులు బండారు సంజీవ్ శుక్రవారం ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 32 అర్జీలు అందాయి. ప్రజల సమస్యలను సావధానంగా విన్న సంజీవ్, వాటిలో కొన్నింటిని సంబంధిత అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.