SDPT: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కురుమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య 99వ జయంతిని పురస్కరించుకుని చేర్యాల పట్టణంలోని అంగడి బజారులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.