TPT: తిరుపతి నగరంలోని ఆయుర్వేదిక్ ఆసుపత్రి సమీపంలోని ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఎవరైనా గుర్తించినట్లయితే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలన్నారు.