BDK: గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజును భద్రాచల దేవస్థానం అధికారులు ఘనంగా సత్కరించారు. 3 దశాబ్దాలుగా భక్తులతో రామకోటిని రాయిస్తున్న ఆయన.. ఏటా స్వామివారి కల్యాణానికి గోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా 300 కిలోల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్ ఆయనను శాలువాతో సన్మానించారు.